గ్రేటర్ హైదరాబాద్‌ను హరితవనంగా తీర్చిదిద్దుతున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. అన్ని పార్కుల్లో వారం రోజులపాటు ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అందులో భాగంగా బంజారాహిల్స్‌లోని గ్రీన్‌వ్యాలీ పార్క్‌లో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మేయర్ రామ్మోహన్ ప్రారంభించారు.
హరితవనంగా గ్రేటర్ హైదరాబాద్: మేయర్ బొంతురామ్మోహన్ - గ్రేటర్‌లో పచ్చందాలు
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని గ్రీన్‌వ్యాలీ పార్క్‌లో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మేయర్ రామ్మోహన్ ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్‌ను హరితవనంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
హరితవనంగా గ్రేటర్ హైదరాబాద్: మేయర్ బొంతురామ్మోహన్
గ్రేటర్‌లో నిరూపయోగంగా ఉన్న పార్కులకు పూర్వ వైభవం తెస్తున్నామని తెలిపారు. నగరవాసులకు ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించేందుకు కొత్తగా 320 పార్కులు, 50 థీమ్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్న జీహెచ్ఎంసీ మేయర్... వాకింగ్ ట్రాక్‌లు, జిమ్‌లు, ఇతర వసతులు కల్పిస్తున్నామని వివరించారు. నగరంలో శిథిలావస్థకు చేరిన భవనాలు కూల్చివేస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి :''స్టార్ మహిళ' షోతో రెండు తరాల్ని చూశా'