హైదరాబాద్ మహానగరంలో కరోనా నివారణకు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. నగర మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులతోపాటు ఇతర శాఖలతో కలిసి సమన్వయంతో ముందుకెళుతున్నామని తెలిపారు. వారంరోజుల క్రితం జోనల్ కమిషనర్లతో జరిగిన సమావేశంలో అందరూ మాస్క్‌లు గ్లౌజ్‌లు వదిలి శానిటైజర్లు ఉపయోగించాలని నిర్ణయించినట్లు మేయర్ పేర్కొన్నారు.
'మాస్కులు వద్దు.. గ్లౌజులు, శానిటైజర్లు ముద్దు'
హైదరాబాద్‌లో కరోనా నివారణకు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. అందరూ మాస్కులు వదిలి గ్లౌజులు, శానిటైజర్లు వాడాలని సూచించారు.
కొన్నిరోజులపాటు బయో మెట్రిక్ మెషిన్లు ఆపేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వైరస్ ఎలా వస్తుంది, రాక ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు శుభ్రంగా ఉంచాలని... శుభ్రత పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపటి నుంచి అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఇప్పటికే నగరాల్లో తనిఖీలు చేయడం... ప్రజలకు చెప్పే ముందు స్వీపర్లు, కిందిస్థాయి సిబ్బంది ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నారో పర్యవేక్షిస్తున్నామని మేయర్ వివరించారు.
ఇవీ చూడండి:ముగ్గురు పిల్లలపై సవతితల్లి అరాచకత్వం