గ్రేటర్ హైదరాబాద్‌లోని 60 శ్మశానవాటికల‌్లో వసతుల కల్పనకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టిందని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీతో కలిసి మల్కంచెరువు సుందరీకరణలో భాగంగా చెరువు వెనకవైపు 100 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ ప్రతిపాదనలను మేయర్ పరిశీలించారు. హౌసింగ్ బోర్డు భూమికి మధ్య ఉన్న శ్మశానవాటికను పరిశీలించారు. అందుబాటులోని బల్దియా స్థలాన్ని కొంత కలపి ప్రహరీ ఏర్పాటు చేస్తామన్నారు.
60 శ్మశానవాటికల‌్లో మౌలిక వసతులు: మేయర్ బొంతు రామ్మోహన్ - ghmc latest news on cemeteries
భాగ్యనగరంలో 60 శ్మశానవాటికల‌్లో మౌలిక వసతులు కల్పనకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టిందని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. సమీపంలోని కాలనీవాసుల సౌకర్యం కోసం అంతర్గత రోడ్లు, నాలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
60 శ్మశానవాటికల‌్లో మౌలిక వసతులు: మేయర్ బొంతు రామ్మోహన్
శ్మశానవాటికకు విద్యుత్, తాగునీరు సదుపాయాన్ని కల్పిస్తామని మేయర్ వెల్లడించారు. సమీపంలోని కాలనీవాసుల సౌకర్యం కోసం అంతర్గత రోడ్లు, నాలాను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తు అవసరాల నిమిత్తం 100 ఫీట్ల రోడ్డు నిర్మాణానికి సహకరించాలని బస్తీవాసులను మేయర్ కోరారు. ఈ అంశంపై బస్తీవాసులు చర్చించుకుని ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు.
ఇదీ చూడండి:ఫార్మా సిటీలో భారీ పేలుడు.. దట్టంగా అలుముకున్న పొగ