కార్మిక హక్కుల సాధనకు చిహ్నంగా మరో చికాగో పోరాట స్ఫూర్తితో కార్మికులంతా మేడేను నిర్వహించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.నర్సింహ కోరారు. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లి మార్కెట్ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో మే డే గోడపత్రికను విడుదల చేశారు. కార్మికుల సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని నర్సింహ ఆరోపించారు. హమాలీల కూలీ రేట్లు పెంచాలని గత రెండు సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తున్నా.. అధికారులు, యజమానులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
'చికాగో పోరాట స్ఫూర్తితో కేంద్ర యత్నాలను తిప్పికొట్టాలి'
మే 1న కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బోయిన్పల్లి మార్కెట్ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో మే డే పోస్టర్ను ఆవిష్కరించారు. చికాగో పోరాట స్ఫూర్తితో కార్మిక లోకం మే డేను నిర్వహించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కోరారు. నూతన కార్మిక, వ్యవసాయ చట్టాలపై పోరాటం చేయాలని సూచించారు.
కార్మిక, వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేస్తూ కార్మికులకు, రైతులకు అన్యాయం, బడా పారిశ్రామికవేత్తలకు లాభాలు చేకూర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను.. చికాగో పోరాట స్ఫూర్తితో తిప్పికొట్టాలని నర్సింహ సూచించారు. మే 1న బోయిన్పల్లి మార్కెట్, కంటోన్మెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఏఐటీయూసీ జెండాలను ఎగురవేయనున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ నాయకులు కొమురయ్య, రాజయ్య, లింగం, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాల్సిందేనా?: హైకోర్టు