హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మేడే వేడుకలు జరుపుకున్నారు. తెరాస ప్రభుత్వం కార్మిక పక్షపాతి అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ బెస్త అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు గోపాల్ కార్మికులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందని ఆయన వివరించారు. కార్యక్రమంలో తెరాస యువ నేతలు ముఠా జై సింహ బెస్త, శంకర్ గౌడ్, ప్రభాకర్ యాదవ్, ముచ్చ కుర్తి ప్రభాకర్, శ్రీనివాస్, బింగి నవీన్, తదితరులు పాల్గొన్నారు.
కార్మికులకు ముషీరాబాద్ ఎమ్మెల్యే 'మే'డే శుభాకాంక్షలు
హైదరాబాద్ ముషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మే'డే' సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ బెస్త 'మే' డే శుభాకాంక్షలు తెలియజేశారు.
ముషీరాబాద్ కార్మికులకు ఎమ్మెల్యే మే 'డే' శుభాకాంక్షలు