తెలంగాణ

telangana

ETV Bharat / state

'లాక్​డౌన్ వల్ల​ కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయి' - LABOURS PROBLEMS IN LOCK DOWN TIME

లాక్​డౌన్​ కారణంగా కార్మికుల బతులుకు రోడ్డున పడ్డాయని ఏఐటీయూసీ నాయకులు నరసింహా ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్​ బోయిన్​పల్లి మార్కెట్​ యార్డులో జరిగిన మే డే ఉత్సవాల్లో పాల్గొన్నారు.

MAY DAY CELEBRATIONS AT BOWENPALLY
'లాక్​డౌన్ వల్ల​ కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయి'

By

Published : May 1, 2020, 5:47 PM IST

హైదరాబాద్​ బోయిన్​పల్లి మార్కెట్ యార్డు​లోని హమాలీ కేంద్రం వద్ద 134 వ మే డే ఉత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. ఏఐటీయూసీ నాయకులు నరసింహ ఆధ్వర్యంలో కార్మిక జెండాను ఆవిష్కరించారు. లాక్​డౌన్ నేపథ్యంలో కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటిత కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని తెలిపారు.

గత 134ఏళ్లుగా కార్మికుల హక్కుల సాధనకై పోరాటాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను నిర్వీర్యం చేసే విధంగా చట్టాలు రూపొందించడం మానుకోవాలని హెచ్చరించారు. హమాలీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ

ABOUT THE AUTHOR

...view details