తెలంగాణ

telangana

ETV Bharat / state

పెళ్లంటూ పలకరించింది.. కోటి కాజేసింది!

మాట్రిమోని పేరుతో పెళ్లి జరిపిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ మహిళపై హైదరాబాద్​ కేపీహెచ్​బీ పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. గతంలోనూ ఇలాంటి తరహ మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Matrimoni fraud in hyderabad.. case filed
'పెళ్లంటారు.. జేబు గుళ్ల చేస్తారు'

By

Published : Jun 1, 2020, 10:01 PM IST

మాట్రిమోని పేరుతో మోసాలకు పాల్పడిన మహిళపై హైదరాబాద్​ కేపీహెచ్​బీ పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. తెలుగు మాట్రీమోనిలో పరిచయమైన మాళవిక అలియాస్​ మాగంటి అనుపల్లవి రూ. కోటి 2 లక్షలు తీసుకుని తనను మోసం చేసిందంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఫిర్యాదు చేశాడు. గతంలోనూ పెళ్లి పేరుతో మాట్రిమోనిలో పరిచయమై కాలిఫోర్నియాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్​ను రూ. 65 లక్షలు మోసం చేసిన కేసులో మాళవిక జూబ్లీహిల్స్ పోలీసులు ఇటీవలే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

కుమారుడు, భర్తతో కలిసి మాళవిక ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఆమె కొడుకు ప్రణవ్​ను అరెస్టు చేయగా భర్త పరారీలో ఉన్నాడు. బాధితులు ఒక్కరొక్కరుగా ఫిర్యాదులు చేయడం వల్ల మాళవిక ఇప్పటి వరకు ఎంతమందిని మోసం చేసిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details