మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్ సమాధులపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు. చవకబారు రాజకీయ ప్రచారం, ప్రయోజనాల కోసం మహానీయులను తూలనాడే కుటిల రాజకీయ విధానాలు విచారకరమన్న శ్రీధర్‌బాబు... ప్రజాస్వామ్యంలో ఇటువంటి కుహనా విధానాలకు తావులేదని పేర్కొన్నారు.
తెరాస చేతకానితనాన్ని అలుసుగా తీసుకుని మహానీయులపై అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆత్మాభిమానాన్ని తమ కుటిల రాజకీయ ప్రయోజనాల కోసం తెరాస, ఎంఐఎం పార్టీల వైఖరిని ఖండిస్తున్నా. ఆ పార్టీలు క్షమాపణలు చెప్పాలి. లేకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.