పలువురు కలెక్టర్లు సహా ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్న కొంత మంది అధికారులకు పోస్టింగులు ఇచ్చింది. అనితా రామచంద్రన్‌కు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చిన ప్రభుత్వం... కామారెడ్డి కలెక్టర్ శరత్‌ను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌గా బదిలీ చేసింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్‌ను పరిశ్రమల శాఖ సంచాలకులుగా బదిలీ చేసింది. రఘునందన్ రావును వ్యవసాయ శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. వెయిటింగ్లో ఉన్న వాసం వెంకటేశ్వర్లుకు యువజన సర్వీసుల సంచాలకులుగా, అబ్దుల్ అజీమ్‌కు మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు.
IAS transfer: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు - telangana varthalu
22:39 August 30
పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా అనితా రామచంద్రన్
8జిల్లాలకు కొత్త కలెక్టర్లు
ఎనిమిది జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. అందులో ఐదుగురు మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్లుగా అవకాశం కల్పించారు. కామారెడ్డి కలెక్టర్‌గా జితేష్ వి పాటిల్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం... జనగామ కలెక్టర్ నిఖిలను వికారాబాద్‌కు బదిలీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా అనురాగ్ జయంతి, నాగర్‌కర్నూల్ కలెక్టర్‌గా ఉదయ్ కుమార్ బదిలీ అయ్యారు. వల్లూరు క్రాంతికి జోగులాంబ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం... శివలింగయ్యను జనగామ కలెక్టర్‌గా బదిలీ చేసింది. బి.గోపిని వరంగల్ కలెక్టర్‌గా బదిలీ చేసిన ప్రభుత్వం... వెయిటింగ్లో ఉన్న శశాంకకు మహబూబాబాద్ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చింది. తాజా బదిలీల్లో కొందరికి పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. వీరితో పాటు మరికొంత మంది ఐఏఎస్ అధికారులు, పెద్దమొత్తంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు త్వరలోనే జరగనున్నాయి.
నియామకాలు:
1. | పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి | అనితా రామచంద్రన్ |
2. | పంచాయతీరాజ్ కమిషనర్ | శరత్ |
3. | వ్యవసాయశాఖ కార్యదర్శి | రఘునందన్‌రావు |
4. | యువజన సర్వీసుల సంచాలకులు | వెంకటేశ్వర్లు |
5. | మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి | అబ్దుల్ అజీమ్ |
6. | కామారెడ్డి కలెక్టర్ | జితేశ్ పాటిల్ |
7. | వికారాబాద్ కలెక్టర్ | నిఖిల |
8. | రాజన్న సిరిసిల్ల కలెక్టర్ | అనురాగ్ జయంతి |
9. | నాగర్‌కర్నూల్ కలెక్టర్ | ఉదయ్‌కుమార్ |
10. | జోగులాంబ గద్వాల కలెక్టర్ | వల్లూరు క్రాంతి |
11. | వరంగల్ కలెక్టర్ | గోపి |
12. | జనగామ కలెక్టర్ | శివలింగయ్య |
13. | మహబూబాబాద్ కలెక్టర్ | శశాంక |
ఇదీ చదవండి: good news: పదోన్నతుల అంశంపై ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు