తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసుల సేవలు అభినందనీయం: అవతార్ ట్రస్ట్ - Corona Virus Updates Today News

రాజధానిలో కరోనా వైరస్ నిర్మూలనకు పోలీసులు చేస్తున్న సేవలు అభినందనీయమని అవతార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ కేవీ ప్రసాద్ గుప్తా అన్నారు. పంజాగుట్ట పోలీస్​స్టేషన్​లో సుమారు 20 వేల మాస్కులు, శానిటైజర్లను ఏసీపీ తిరుపతన్నతో కలిసి పోలీస్ సిబ్బందికి పంపిణీ చేశారు.

పోలీసుల సేవలు అభినందనీయం: అవతార్ ట్రస్ట్
పోలీసుల సేవలు అభినందనీయం: అవతార్ ట్రస్ట్

By

Published : May 9, 2020, 5:10 PM IST

హైదరాబాద్ మహానగరంలో కరోనా వైరస్ నిర్మూలనకు పోలీసులు చేస్తున్న సేవలు అభినందనీయమని అవతార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ కేవీ ప్రసాద్ గుప్తా అన్నారు. లాక్ డౌన్ సమయంలో పోలీసుల సేవలు ఎన్నటికీ మరువలేనివని కొనియాడారు. పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​లో సుమారు 20 వేల మాస్కులు, శానిటైజర్లను ఏసీపీ తిరుపతన్నతో కలిసి పోలీస్ సిబ్బందికి పంపిణీ చేశారు. సమాజ సేవ చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఏసీపీ పేర్కొన్నారు. అవతార్ ఛారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు.

ప్రాణాన్నిపణంగా పెట్టి... వృత్తి ధర్మాన్ని పాటించడం గర్వకారణం

కరోనా నిర్మూలన కోసం లాక్​డౌన్ సమయంలో పోలీసులు, వైద్యులు, మునిసిపల్ సిబ్బంది చేస్తున్న సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని అవతార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ కేవీ ప్రసాద్ గుప్తా అన్నారు. పోలీసులు తమ ప్రాణాలు పణంగా పెట్టి... వృత్తి ధర్మాన్ని పాటించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు.

పోలీసుల సేవలు అభినందనీయం: అవతార్ ట్రస్ట్

ఇదీ చూడండి:ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details