తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి'

కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని... నారాయణగూడ సీఐ గట్టుమల్లు అన్నారు. చేతన ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాస్కులు, శానిటైజర్​ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Masks distribution program in Narayanguda
నారాయణగూడలో మాస్కుల పంపిణీ కార్యక్రమం

By

Published : May 3, 2021, 5:34 PM IST

కరోనా కట్టడికి హైదరాబాద్ పోలీసులు తోడ్పాటు అందిస్తున్నారని... నారాయణగూడ సీఐ గట్టుమల్లు తెలిపారు. చేతన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, భాజపా నాయకుడు కేశబోయిన శ్రీధర్ ఆధ్వర్యంలో... ఏర్పాటు చేసిన మాస్క్​లు, శానిటైజర్​ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని... కొవిడ్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.

రెండో దశ కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో చేతన ఫౌండేషన్ ద్వారా వేలాది మందికి ఉచితంగా మాస్క్​లు, శానిటైజర్​లు అందజేస్తున్న శ్రీధర్​ను... సీఐ అభినందించారు.

ఇదీ చదవండి: లైవ్​ అప్​డేట్స్​: జడ్చర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తెరాస

ABOUT THE AUTHOR

...view details