ఆపన్న హస్తం చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశారు. ఆపన్న్ హస్త్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు సుధా నయన, కోశాధికారి విజయ్ కుమార్ వెంపటి స్వర్ణాంజలి హైస్కూల్ ఛైర్మన్ అర్తికకు వీటిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీజీవో నేత, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత హాజరయ్యారు. విద్యార్థులు మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా ధరించి కరోనాను తరిమికొట్టాలన్నారు. విద్యార్థులు జాగ్రత్తగా పరీక్షలు రాయాలని మమత సూచించారు.
విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్ పంపిణీ - tenth students latest news
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు 'ఆపన్న్ హస్త్' చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీజీవో నేత, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత హాజరయ్యారు.

విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్ పంపిణీ
Last Updated : Jun 6, 2020, 8:17 AM IST