హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని బోలక్‌పూర్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇందువల్ల అక్కడ విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి జీహెచ్ఎంసీ సర్కిల్ 15 ఉప కమిషనర్ ఉమా ప్రకాశ్ మాస్కులను, చేతి గ్లౌజులను అందజేశారు. అనునిత్యం ప్రజల ప్రాణాల కోసం పరోక్షంగా కష్టపడుతున్న పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జీహెచ్ఎంసీ కార్మికులకు మాస్కులు, గ్లౌజుల పంపిణీ - masks and glouse distribution to ghmc workers at bholakpur
హైదరాబాద్ బోలక్‌పూర్‌లో కరోనా వైరస్‌తో కనిపించని యుద్ధం చేస్తున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు జీహెచ్ఎంసీ సర్కిల్ 15 ఉప కమిషనర్ ఉమా ప్రకాశ్, ఏహెచ్ఎంవో హేమలత మాస్కులను, చేతి గ్లౌజులను పంపిణీ చేశారు.
జీహెచ్ఎంసీ కార్మికులకు మాస్కులు, గ్లౌజుల పంపిణీ
పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని ఉమా ప్రకాశ్ సూచించారు. నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఉన్న ఆకుకూరలను తినాలని ఆమె తెలిపారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ, శానిటైజర్ వాడుతూ విధులు నిర్వహించాలని కోరారు. ఆరోగ్య విషయంలో ఏ మాత్రం అలసటగా ఉన్నా అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు.