నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇండో టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీకి సంబంధించిన 90 మంది సిబ్బంది.. యానాంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
రాజకీయ నాయకులకు సరే.. మహాత్ముడికి ముసుగెందుకు వేశారు? - యానాంలో గాంధీ విగ్రహానికి ముసుగు వార్తలు
ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే.. రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయటం పరిపాటే. కానీ.. యానాంలో మాత్రం.. రాజకీయ నాయకుల విగ్రహాలతో.. జాతిపిత గాంధీ విగ్రహానికి సైతం తెల్లని ముసుగు తొడిగారు.
రాజకీయ నాయకులకు సరే.. మహాత్ముడికి ముసుగెందుకు వేశారు?
రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ ఆదేశాలతో.. యానాం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు వేసే ప్రక్రియ మెుదలయ్యింది. కానీ, రాజకీయ నాయకుల విగ్రహాలతో పాటు మహాత్మ గాంధీ విగ్రహానికి సైతం తెల్లని ముసుగు వేశారు.
ఇదీ చదవండి:చదువులు.. సరదాలు.. శాటిలైట్ రూపకర్తలు!