మాస్కు వేసుకుంటే కరోనా సోకదనేది కేవలం అపోహ మాత్రమేనని ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్ అన్నారు. అందరికీ మాస్కులు అవసరం లేదని సూచించారు. మాస్కుల విపరీత డిమాండ్ వల్ల వాటి ధరలు పెరిగిపోయాయని పేర్కొన్నారు.
నివారణ లేని వైరస్‌కు.. అవగాహనే మందు
మన వాతావరణ పరిస్థితుల్లో కరోనా వైరస్ బతికే పరిస్థితి దాదాపు లేదని.. అయినా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం మంచిదేనన్నారు. ఈనెలాఖరు వరకు వైరస్ భయాలు పూర్తిగా తొలిగిపోతాయన్న ఆయన.. నిరభ్యంతరంగా ఎవరి పని వారు చేసుకోవచ్చని ధైర్యం చెప్పారు.
ఎలా వస్తుంది...?
* ఒక్క అడుగు దూరంలో తుమ్మినప్పుడు ఆ తుంపరలు మన చేతిని తాకి ముఖాన్ని ముట్టుకున్నప్పుడు వైరస్ వచ్చే ప్రమాదం ఉంది.
* ఈ వైరస్ గాలిలో 15 నుంచి 20 నిమిషాల కంటే ఎక్కువ బతకదు.