సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలోని వీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ వల్ల నవీన్ వినూత్న రీతిలో రాఖీ పండుగ నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలందరికీ కరోనాపై అవగాహన కల్పించారు. నవీన్‌కు తన చెల్లెలు రాఖీ కట్టి మిఠాయి తినిపించగా... మాస్కు, శానిటైజర్, గ్లౌజులను బహుమతిగా ఇచ్చారు.
రాఖీ కట్టిన సోదరికి మాస్కు, శానిటైజర్ బహుమతి - రాఖీ కట్టిన చెల్లికి మాస్కు, శానిటైజర్ బహుమతి
సికింద్రాబాద్‌లో ఓల్డ్ బోయిన్‌పల్లిలోని వీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ వల్ల నవీన్... రాఖీ కట్టిన తన చెల్లికి మాస్కు, శానిటైజర్, గ్లౌజులను బహుమతిగా అందజేశాడు.
రాఖీ కట్టిన సోదరికి మాస్కు, శానిటైజర్ బహుమతి
ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని... అందరూ ఇదే విధంగా బహుమతులు అందజేయాలని నవీన్ కోరాడు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇవీ చూడండి:రాఖీ స్పెషల్... వీరి అనుబంధం.. దేశానికే రక్ష కావాలి..