హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్‌నగర్‌లో ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అశోక్‌నగర్‌కు చెందిన ముక్క పల్లి వంశీ, ముక్కపల్లి సంగీత దంపతులు. వంశీ రక్షణ శాఖ పరిధిలో డైరీ ఫామ్‌లో గార్డెనింగ్‌గా పని చేస్తుండగా సంగీత ఇంటివద్దనే ఉండేవారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు.
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య - hyderabad crime news
ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ అల్వాల్‌లోని అశోక్‌నగర్‌లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి వచ్చి తలుపులు తెరవగా సంగీత ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. చిన్నారులు వెంటనే పక్కంటివారికి చెప్పగా వారు వంశీకి సమాచారమందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి:మేడారానికి కోటీ 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా...: ఇంద్రకరణ్