తెలంగాణ

telangana

ETV Bharat / state

కలల కాపురంలో కల్లోలం.. చివరికి బలవన్మరణం - కాచిగూడలో వివాహితురాలు ఆత్మహత్య

జీవితం సాఫీగా సాగిపోతోంది. ఇంతలోనే ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ఆమెలో ప్రశాంతత కరువైంది. అసలేం జరిగిందో తెలియదు కానీ.. ఆమె బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్​లో కాచిగూడలో చోటుచేసుకుంది.

married-lady-suspect-suicide-in-kachiguda-area-in-hyderabad
కలల కాపురంలో కల్లోలం.. చివరికి బలవన్మరణం

By

Published : May 28, 2020, 1:20 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన రాజేశ్వరి కుమార్తె కారుణ్య గురులక్ష్మి(27)కి సురేశ్​తో వివాహమైంది. హైదరాబాద్​లోని మిర్రర్స్ లగ్జరీ సెలూన్​లో పనిచేస్తూ బేగంపేటలో భర్తతో కలిసి ఉంటోంది. ఇటీవల కాచిగూడ​లో ఉంటున్న చెల్లెలు జయ భార్గవి దగ్గరికి వెళ్లింది. మంగళవారం రాత్రి చున్నీతో ఫ్యాన్​కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఓ కార్యక్రమంలో జీవన్ అనే వ్యక్తితో కారుణ్య గురు లక్ష్మికి పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ఆమెలో మార్పు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. జీవన్ అనే వ్యక్తి తరచుగా బెదిరింపులకు పాల్పడుతూ బ్లాక్​మెయిల్ చేసేవాడని తల్లి రాజేశ్వరి ఆరోపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై మధు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!

ABOUT THE AUTHOR

...view details