తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్కులతోనే పెళ్లి.. లేదంటే కరోనాతో లొల్లి.!

మూడు మాసాల కిందట పెళ్లి నిశ్చయమైంది. ఇరు కుటుంబాలు కూర్చొని ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఇంతలో కరోనా వైరస్‌ వ్యాప్తితో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. వధువు ఇంటి వద్దే సాదాసీదాగా వివాహం జరిపించారు.

marriage with masks in Hyderabad
కరోనా వేళ.. మాస్కులతో పెళ్లి

By

Published : Apr 6, 2020, 1:27 PM IST

హైదరాబాద్​ ఓల్డ్‌బోయిన్‌పల్లిలోని రాజరాజేశ్వరినగర్‌కు చెందిన నిషితరెడ్డి, ఎల్‌బీనగర్‌ నివాసి శ్రీకాంత్‌రెడ్డిలకు మూడు నెలల క్రితం పెళ్లి నిశ్చయించారు. ఇంతలో కరోనా వైరస్‌ వ్యాప్తితో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ముహూర్తం ముందుకు జరిపితే.. మళ్లీ ఆరేడు నెలల వరకు మంచి ముహూర్తం లేదన్న ఉద్దేశంతో హడావిడి లేకుండా అమ్మాయి ఇంటి వద్దే పెళ్లి చేశారు.

ముందుగా నిర్ణయించిన ప్రకారం బంధుమిత్రులు, పెద్దల సమక్షంలో ఆదివారం బోయిన్‌పల్లిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరగాల్సి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా ఓల్డ్‌బోయిన్‌పల్లిలోని అమ్మాయి ఇంటి వద్ద బంధువులు, మిత్రులు లేకుండా కేవలం వధూవరుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అంతా కలిసి 18 మంది పాల్గొనగా.. అందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ అన్ని జాగ్రత్తల మధ్య పెళ్లి చేశారు.

ఇదీ చదవండి:కరోనా ప్రభావం: మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details