కరోనా సంక్షోభం దృష్ట్యా నిరాడంబరంగా పెళ్లిచేసుకుంది ఓ జంట. చందానగర్‌లో ఎస్‌మాక్స్ హెచ్‌ఆర్ ఉద్యోగి తొట్టెంపూడి నరేంద్రబాబు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వాసిరెడ్డి మౌనికను నిన్న వివాహం చేసుకున్నారు.
పెళ్లి ఖర్చు రూ.25వేలు.. కరోనా కాలం గురూ..!
లాక్డౌన్ కారణంగా పెళ్లిల్లు వాయిదా పడుతూనే ఉన్నాయి. కొందరు మాత్రం నిరాడంబరంగా... సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకుంటున్నారు. ఈ లాక్డౌన్ వేళ పెళ్లి చేసుకోవడం వల్ల ఖర్చు కూడా తక్కువే అవుతుందని తెలుపుతున్నారు.
లాక్డౌన్ వేళ ఇంట్లోనే పెళ్లి... ఖర్చు ఎంతంటే...
మార్చి నెలలో పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు నిశ్చయించగా... ఈలోపు లాక్‌డౌన్‌తో వివాహం వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా హంగు, ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకుందామని నరేంద్రబాబు, మౌనిక నిర్ణయించుకున్నారు. శనివారం చందానగర్ శ్రీటవర్స్ అపార్ట్‌మెంట్‌లోని వధువు ఇంట్లో నిరాడంబరంగా పెళ్లి జరిపించేశారు. కేవలం వధువు, వరుడి తల్లిదండ్రులతో సహా పది మంది బంధువులు మాత్రమే వేడుకకు హాజరయ్యారు. మొత్తం ఖర్చు రూ.12 వేలలోపే అయ్యిందని తెలిపారు.