ఏపీ తిరుపతికి చెందిన యువతి పతంగి స్వప్న, అలియాస్ పతంగి హరిణి, అలియాస్ నందమూరారి స్వప్నఇలా పేర్లు మార్చి.. ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. మ్యాట్రిమోని వెబ్ సైట్లలో తాను ఐపీఎస్ అధికారిగా బయోడేటా ఇచ్చి.. డబ్బున్న వారిని నమ్మించి బుట్టలో పడేస్తుంది.పెళ్లి చేసుకుని కొంత కాలం కాపురం చేసి తర్వాత వేరుగా ఉంటానని.. సెటిల్‌మెంట్ చేసుకుంటుంది. ఇలా ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని వారి వద్ద నుంచి కొంత మొత్తంలో డబ్బులు వసూలుచేసింది.
గత ఏడాది డిసెంబరులో ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వీరేపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. మూడు నెలలపాటు వారు హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. డెన్మార్క్‌లో ఉద్యోగం చేసే రామాంజనేయులు స్వప్నను అక్కడకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేశాడు. అయితే ఆమె తనతో వెళ్లేందుకు నిరాకరించింది. పాస్‌పోర్టుకు ఇప్పుడే దరఖాస్తు చేయలేనని కొన్నిపనులు ఉన్నాయని తెలిపింది. దీంతో రామాంజనేయులు ఒక్కడే డెన్మార్క్ వెళ్లాడు. కానీ స్వప్న వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన ఆ యువకుడు అసలు విషయమేంటనే కోణంలో కూపీ లాగాడు. దాంతో స్పప్న లీలలు వెలుగు చూశాయి.
మ్యాట్రిమోనీలో ధనవంతులకు వలవేసి.. మూడు పెళ్లిళ్లు - ప్రకాశం జిల్లాలో నిత్యపెళ్లికూతురు
ఓ నిత్యపెళ్లికూతురు.. మ్యాట్రిమోని వెబ్‌సైట్లలో డబ్బున్నఅబ్బాయిలను వెతుకుతుంది. వారితో చాటింగ్ చేసి పరిచయం పెంచుకుంటుంది. పెళ్లి చేసుకుని కొంత కాలం కాపురం చేస్తుంది. ఆ తరువాత బెదిరించి సెటిల్ మెంట్ చేసుకుంటుంది. ఇవన్నీఆ నిత్యపెళ్లి కూతురికి వెన్నతో పెట్టిన విద్య. కాదని ఎవరైనా అడ్డం తిరిగితే.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ఆమె స్టైల్.
రామాంజనేయులు కంటే ముందు మరో ఇద్దరిని ఆమె వివాహం చేసుకున్నట్టు తెలిసింది. చిత్తూరుకు చెందిన పృధ్విరాజ్ ఆత్మకూరుకు చెందిన సుధాకర్ అనే మరో ఇద్దరితో ఆమెకు గతంలో వివాహమైనట్టు రామాంజనేయులు గుర్తించాడు. పృధ్వీపై తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్ లో స్వప్న కేసు పెట్టినట్టు తెలుసుకున్నాడు. అంతే కాదు తిరుపతికి చెందిన ఓ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె వద్ద నుంచి రూ.6 లక్షలు వసూలు చేసిన ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై తిరుపతి సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో స్వప్నపై కేసు నమోదైంది. వివరాలన్నీ తెలిశాక రామాంజనేయులు స్వప్నని నిలదీశాడు.
పెళ్లి చేసుకున్నావు కాబట్టి రూ.30 లక్షలు ఇచ్చి సెటిల్‌మెంట్ చేసుకోవాలని స్వప్న డిమాండ్ చేసింది. అతను ఆమె బెదిరింపులకు లొంగకపోవడంత వల్ల స్వప్న దొనకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరోవైపు స్వప్న వ్యవహారంపై రామాంజనేయులు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో స్వప్న అసలు రంగు బయటపడింది. రెండు కేసులను పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఫణిభూషణ్ తెలిపారు. రామాంజనులు డెన్మార్క్ నుంచి రావాల్సి ఉంది.
ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది..