మ్యారేజ్ బ్యూరోల నిర్వాహకుల పట్ల పోలీసుల వైఖరి మారాలని హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆలిండియా అసోసియేషన్ అధ్యక్షుడు భానుప్రకాశ్ రెడ్డి కోరారు. తమను చిన్నచూపు చూస్తూ ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరించడం సరికాదన్నారు. కొందరు ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలికి న్యాయం చేయాలి' - హైదరాబాద్ సమాచారం
మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులను బెదిరించడం తగదని ఆలిండియా మ్యారేజ్ బ్యూరోస్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్‌లో డిమాండ్ చేశారు. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకుండా వేధించడంతో గుండె నొప్పితో ఓ నిర్వాహకురాలు మరణించిందని తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
'మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలికి న్యాయం చేయాలి'
మిర్యాలగూడకు చెందిన సత్యనారాయణ, కుత్బుల్లాపూర్‌కు చెందిన దాసరి నర్సింగరావుల పిల్లల వివాహానికి రూ.6 లక్షలకు ఒప్పందం కుదిరిందన్నారు. డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు గురి చేయడంతో సంతోషిమాత మాలతీ మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు గుండెనొప్పితో మరణించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.