పార్టీకి విధేయత కలిగిన, పార్టీని బలోపేతం చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడికే పీసీసీ పగ్గాలు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఏర్పడిన ఖాళీని అధిష్టానం శాస్త్రీయబద్ధంగా భర్తీ చేయాలని ఆయన సూచించారు.
అలాంటి వారికే పీసీసీ పగ్గాలు అప్పగించాలి: మర్రి - మర్రి శశిధర్‌రెడ్డి తాజా వార్తలు
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా వల్ల ఏర్పడిన ఖాళీని కాంగ్రెస్ అధిష్టానం శాస్త్రీయబద్ధంగా భర్తీ చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి కోరారు. పార్టీని బలోపేతం చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడికే పీసీసీ పగ్గాలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.
అలాంటి వారికే పీసీసీ పగ్గాలు అప్పగించాలి: మర్రి
త్వరలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో.. తాను ఈ సూచన చేస్తున్నట్లు శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద శ్రేణులకు మరింత విశ్వాసం కలిగించేటట్లు పని చేయగలిగే నాయకుడికి పీసీసీ అధ్యక్ష పీఠం ఇవ్వాలని ఆయన కోరారు.