వరదలు, అధిక వర్షాలు వచ్చినప్పుడు చేపట్టాల్సిన కార్యక్రమాల కోసం ఓ శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని మాజీమంత్రి, జాతీయ విపత్తుల నిర్వహణ మాజీ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాకాలానికి ముందు వరద కాలువల పూడికతీత, వ్యర్థాల తొలగింపు లాంటి చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో సముద్రం లేకపోయినా.. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే హైదరాబాద్లో ఇలాంటి ఉపద్రవం ఎదురైందని మర్రి ఆరోపించారు.
విపత్తుల పర్యవేక్షణకు శాశ్వత పరిష్కారం అవసరం: మర్రి - marri sasidhar reddy on hyderabad floods
తెలంగాణలో వరదలు వచ్చినప్పడు చేపట్టాల్సిన కార్యక్రమాలకు ఓ శాశ్వత పరిష్కారం చూపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు. వర్షాకాలంలో చేపట్టాల్సిన ముందస్తు ప్రణాళికలు జరపకపోవడం వల్లే హైదరాబాద్కు వరదలు ముంచెత్తాయని ఆయన ఆరోపించారు.
![విపత్తుల పర్యవేక్షణకు శాశ్వత పరిష్కారం అవసరం: మర్రి marri sashidhar reddy on hyderabad floods](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9271319-800-9271319-1603360864810.jpg)
విపత్తుల పర్యవేక్షణకు శాశ్వత వ్యవస్థ అవసరం: మర్రి శశిధర్
తెలంగాణవ్యాప్తంగా హైదరాబాద్కు అత్యధిక ఆదాయం వస్తున్నప్పటికీ మౌలిక వసతుల కల్పన కరవైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు వివరించాలని మర్రి శశిధర్ డిమాండ్ చేశారు. బాధితులకు ఆర్థిక సహాయం అందజేయడంలో రాజకీయాలు అంటగట్టకుండా.. అందరికీ ప్రభుత్వ సహాయం అందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.