తెలంగాణ

telangana

ETV Bharat / state

నిత్యావసరాలను పంపిణీ చేసిన మర్రి రాజశేఖర్​ రెడ్డి - Marri Rajashekar Reddy latest news

లాక్​డౌన్ కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆకలితో ఉండకూడదని సర్కారు అనునిత్యం కష్టపడుతోందని తెరాస మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్​ఛార్జి​ మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ చర్యలతోపాటు ప్రభుత్వ సూచనలను పాటించాలని సూచించారు.

Hyderabad district latest news
Hyderabad district latest news

By

Published : May 20, 2020, 5:37 PM IST

సికింద్రాబాద్ కంటోన్మెంట్ 7వ వార్డులో బోర్డ్ మెంబర్ భాగ్యశ్రీ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన తెరాస మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్​ఛార్జి​ మర్రి రాజశేఖర్ రెడ్డి... చిన్నకమేల, శ్రీనగర్ కాలనీ, చిన్నమ్మతల్లి బస్తీలకు చెందిన పేద ప్రజలకు నిత్యావసర సరకులను అందజేశారు.

సర్కారు లాక్​డౌన్ నిబంధనల​ నుంచి కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ... ప్రతి ఒక్కరూ పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత దూరం పాటిస్తూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details