తెలంగాణ

telangana

ETV Bharat / state

అసదుద్దీన్​​పై ఎన్నికల సంఘానికి మర్రి ఫిర్యాదు - Marri complaint against asaduddin

ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ ఓ లేఖ రాశారు.

marri
ఎన్నికల సంఘానికి మర్రి ఫిర్యాదు

By

Published : Jan 16, 2020, 9:01 PM IST

Updated : Jan 16, 2020, 10:14 PM IST

కాంగ్రెస్‌ పార్టీ నుంచి డబ్బు తీసుకుని ఓటు మాత్రం ఎంఐఎంకు వేయాలని అసదుద్దీన్​పై ఓవైసీ మాట్లాడారని మర్రి శశిధర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి సభలో ఈ వ్యాఖ్యలు చేశారని... ఓటర్లను ఇలా కోరడం నియమావళికి వ్యతిరేకమని ఎస్​ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. సభలో ఓవైసీ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను కూడా అందులో జత చేశారు.

అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి దగ్గరగా పని చేస్తున్న ఎంఐఎంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మర్రి శశిధర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

అసద్దుదీన్​పై ఎన్నికల సంఘానికి మర్రి ఫిర్యాదు

ఇవీ చూడండి: 'అధికారంలోకి వస్తే.. మున్సిపల్ టాక్స్ రద్దు'

Last Updated : Jan 16, 2020, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details