తెలంగాణ

telangana

ETV Bharat / state

టోకెన్‌ ఉన్న మక్క రైతుల పంటనే కొనాలి: మార్కెటింగ్​ శాఖ - మక్కపంట కొనుగోలు నూతన మార్గదర్శకాలు

మొక్కజొన్నల కొనుగోలుపై మార్కెటింగ్​శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ముందుగా రైతులకు టోకెన్లు జారీ చేసి ఆ ప్రకారం మక్క పంటలను కొననున్నట్టు పేర్కొంది.

marketing department has released new guidelines on the purchase of the corn crop
టోకెన్‌ ఉన్న మక్క రైతుల పంటనే కొనాలి: మార్కెటింగ్​ శాఖ

By

Published : Oct 28, 2020, 8:47 AM IST

ముందుగా రైతులకు టోకెన్లు జారీచేసి, ఆ ప్రకారం మొక్కజొన్న(మక్క)లను అమ్మడానికి తెచ్చిన వారి నుంచే మద్దతు ధరకు కొనాలని మార్కెటింగ్‌ శాఖ ఆదేశించింది. మక్కలను మద్దతు ధరకు కొనాలని ప్రభుత్వం నిర్ణయించగా మంగళవారం మార్గదర్శకాలను జారీచేసింది.

ముఖ్యాంశాలు: రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (మార్క్‌ఫెడ్‌) ప్రభుత్వం తరఫున నోడల్‌ ఏజెన్సీగా కొనుగోలు కేంద్రాలు తెరుస్తుంది. ఏ జిల్లాలో ఎన్ని కేంద్రాలు తెరవాలనేది కలెక్టర్‌ అధ్యక్షతన గల కమిటీ నిర్ణయించాలి.

* ప్రతీ జిల్లాలో సాగు విస్తీర్ణం, దిగుబడి అంచనాల ఆధారంగా రైతులకు టోకెన్లు జారీచేయాలి. ప్రతీ రైతు పొలం వద్దకు వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ రెవెన్యూ అధికారి వెళ్లి చూసి ఎంత దిగుబడి వస్తుందనేది అంచనా వేసి టోకెన్‌లో రాయాలి. అందులో తెలిపిన తేదీ నాడే పంటను కొనుగోలు కేంద్రానికి తేవాలి. కరోనా నేపథ్యంలో రోజూ కొందరికే టోకెన్లు ఇవ్వాలి.

* ఏ గ్రామంలో ఏయే రైతులు ఈ పంటను సాగు చేశారనే వివరాలు ‘రైతుల సమగ్ర సమాచారం’ పోర్టల్‌లో ఉన్నాయి. వాటి ప్రకారమే టోకెన్లు ఇవ్వాలి.

* రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలంలో మక్కల సాగు వద్దని ప్రభుత్వం చెప్పినా కొందరు రైతులు 2.29 లక్షల ఎకరాల్లో పంట వేశారు. కానీ దేశవ్యాప్తంగా 2.04 కోట్ల ఎకరాల్లో వేయడం వల్ల 3.50 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా.

* క్వింటా మద్దతు ధర రూ.1850కి గాను ప్రస్తుత మార్కెట్‌ ధర రూ.1000 వరకే ఉంది. రైతులు నష్టపోకూడదని మద్దతు ధరకు కొనాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మార్క్‌ఫెడ్‌ తెలిపింది.

* 14 శాతంలోపు తేమ ఉన్న మక్కలనే కొనాలి.

ఇదీ చూడండి:మేమూ నేరుగా పంటల్ని కొంటాం: మార్కెటింగ్​శాఖ

ABOUT THE AUTHOR

...view details