తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు ఏవోబీ బంద్.. అప్రమత్తమైన పోలీసులు - maoist

నేడు మావోయిస్టుల బంద్ పిలుపుతో ఏవోబీలో ఉద్రిక్తత నెలకొంది. దాడులు జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. ప్రభావిత ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించారు.

నేడు ఏవోబీ బంద్..

By

Published : Oct 3, 2019, 7:26 AM IST


ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో నేడు మావోయిస్టు పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. గత నెల 22, 23న గూడెంకొత్తవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీలో జరిగిన రెండు ఎదురుకాల్పుల ఘటనలో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఓ మహిళా మావోయిస్టు నాయకురాలు గాయాలతో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆవిర్భావ వారోత్సవాలు సందర్భంగా సమావేశం నిర్వహించేందుకు వెళ్తుండగా ఏకపక్షంగా కాల్చిచంపారని ఆరోపిస్తూ బంద్​కు పిలుపునిచ్చారు.

అప్రమత్తమైన పోలీసులు...
మావోయిస్టులు బంద్‌కు పిలుపునివ్వడంతో సీలేరులో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. విధ్వంస ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు అగ్రనేతలు ఇప్పటికే ఏవోబీ సరిహద్దులకు చేరుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు, జిమాడుగుల, డుంబ్రిగూడ, పెదబయలు, ముంచింగ్ పుట్ పోలీస్ స్టేషన్ లకు అదనపు పోలీసు బలగాలను అధికారులు తరలించారు. సీలేరు జ‌ల‌విద్యుత్కేంద్రం, ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి-మూడేళ్లు సమయం ఇవ్వండి.. మార్పు మీరే చూడండి!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details