Maoist Leader Sandeep Deepak Rao Arrested :మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సందీప్ దీపక్ రావు(Maoist Sandeep Deepak Rao) అరెస్టుపై రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్(DGP Anjani Kumar) హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అతని అరెస్టుపై జరిగిన పరిణామాలను, అందుకు గల కారణాలను వివరించారు. పలువురు మావోయిస్టు అగ్రనేతలతో దీపక్‌రావు సమావేశాలు నిర్వహించారని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా, పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శిగా సందీప్ దీపక్ రావు ఉన్నారని డీజీపీ వెల్లడించారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ ట్రైజంక్షన్ ఏరియాలో ఆయన కీలకంగా ఉన్నారన్నారు. అబూజ్ మడ్ వెళ్లేందుకు 4 రోజుల క్రితం హైదరాబాద్ చేరుకోగా ఎస్ఐబీ ఇచ్చిన పక్కా సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారని డీజీపీ తెలిపారు. కూకట్‌పల్లిలోని మలేషియా టౌన్ షిప్లో నివాసం ఉండే రంజిత్ శంకరన్, మాదాపూర్‌లో నివాసం ఉంటే ఫిల్మ్ ఎడిటర్ అజిత్ కుమార్ దీపక్ రావు స్నేహితులని.. వీళ్ల ప్రమేయం గురించి దర్యాప్తు చేస్తున్నట్లు అంజనీ కుమార్ వెల్లడించారు.
" మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా, పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శిగా సందీప్ దీపక్ రావు ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ ట్రైజంక్షన్ ఏరియాలో ఆయన కీలకం. కూకట్‌పల్లిలోని మలేషియా టౌన్ షిప్లో సందీప్‌ను అరెస్టు చేశాం. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక పోలీసులు ఇతని కోసం వెతుకుతున్నారు. దయచేసి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి." -అంజనీ కుమార్, డీజీపీ
Maoist Leader Sandeep Deepak Rao Arrested మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్‌రావు అరెస్ట్ డీజీపీ fake Maoists arrested: మావోయిస్టుల పేరుతో బెదిరింపులు.. తొమ్మిది మంది అరెస్ట్
Maoist Deepak Sandeep Arrest :సందీప్ దీపక్ రావు కోసం మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక పోలీసులు వెదుకుతున్నారని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. అలాగే ఎన్ఐఏ బృందాలు కూడా ఇతని కోసం వెతుకుతున్నాయని తెలియజేశారు. మహారాష్ట్రలో అయితే దీపక్‌రావుపై రూ.25 లక్షల రివార్డు ప్రకటించినట్లు వెల్లడించారు. 2000 సంవత్సరంలో.. 2005లో దీపక్ రావు అరెస్ట్ అయినప్పటికీ.. జైలు నుంచి బయటికి వచ్చి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అంజనీ కుమార్ తెలిపారు. ఇతని అరెస్టు మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే అని వ్యాఖ్యానించారు. ఇతని భార్య కూడా మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్నారన్నారు. ఆమెపై కూడా నిఘా పెట్టామని డీజీపీ అంజనీ కుమార్ ప్రకటించారు.
Four Arrested for Transferring Money to Maoists : మావోయిస్టుల కోసం డబ్బుల తరలింపు.. నలుగురు అరెస్టు
Maoist arrested in Bhadradri Kottagudem : ఇదిలా ఉండగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం టేకుల చెరువు అటవీ ప్రాంతంలో వాహన తనిఖీలు చేస్తుండగా మావోయిస్టు కొరియర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన కుంజా ఉమేశ్ చాలాకాలంగా మావోయిస్టులతో పని చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 21 నుంచి 27 వరకు మావోయిస్టులు జరిపే వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను తీసుకుని వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మావోయిస్టుల కరపత్రాలను చర్లలో పంచడానికి వస్తుండగా అరెస్టు చేసినట్లు తెలిపారు.
44 మంది నక్సల్స్ లొంగుబాటు- ఒకరిపై రూ.2 లక్షల రివార్డు
మార్కెట్లో జవాన్‌తో నక్సలైట్ల ముచ్చట్లు.. ఏం జరుగుతుందో తెలిసేలోపే..