తన ఆస్తులను కాపాడుకోవడానికే మాజీమంత్రి ఈటల రాజేందర్ భాజపా తీర్థం పుచ్చుకున్నారని రాష్ట్ర మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ విమర్శించారు. సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్ ఒకే గూటికి చెందిన పక్షులని ఆయన ఆరోపించారు. దీనిపై ఆయన పేరుతో కూడిన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
MAOIST JAGAN: 'భాజపాలో ఈటల చేరికకు వ్యతిరేకంగా మావోయిస్టుల లేఖ' - మావోయిస్టుల పత్రికా ప్రకటన
సీఎం కేసీఆర్, మాజీమంత్రి ఈటల రాజేందర్ ఒకే గూటి పక్షులని తెలంగాణ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన పేరుతో ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పత్రికా ప్రకటన
మొన్నటి దాకా అధికారం అనుభవించిన ఈటల ఆస్తుల రక్షణ కోసమే కాషాయ కండువా కప్పుకున్నారని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్యూలను ఒకే గాటిన కట్టడం తగదని హితవు పలికారు. మాజీ మంత్రి ఈటలకు ఆర్ఎస్యూ, మావోయిస్టు పార్టీ ఎలాంటి మద్దతు ఇవ్వదని జగన్ పత్రికా ప్రకటనలో వివరించారు.
ఇదీ చూడండి:Harish Rao: 'ఈ నెల 20న సిద్దిపేటకు సీఎం కేసీఆర్'
Last Updated : Jun 16, 2021, 4:32 PM IST