బెయిల్‌పై విడుదలై తిరిగి కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ మావోయిస్టు దంపతులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 2016లో జైలు నుంచి విడుదలై తన భార్య అనురాధతో కలిసి హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో నివాసం ఉంటున్నాడు. అతని భార్యతో కలిసి మావోయిస్టు నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందగా... ఈ రోజు మధ్యాహ్నం నుంచి అకస్మాత్తుగా సోదాలు నిర్వహించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడు ల్యాప్‌టాప్‌లు, మెమొరి కార్డులు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీరు జూన్ నుంచి మావోయిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఇతని భార్య కూడా గతంతో పలు మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారని పోలీసులు వివరించారు.
అప్పట్లో లొంగిపోయారు.. ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టారు...! - crime
బెయిల్‌పై విడుదలై తిరిగి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ మావోయిస్టు దంపతులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో అకస్మాత్తుగా సోదాలు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
మావోయిస్టు దంపతుల అరెస్టు