దీపావళి(Diwali effect) సందర్భంగా బాణాసంచా కాల్చిన సమయంలో జరిగిన ప్రమాదాల వల్ల గాయపడిన బాధితులతో హైదరాబాద్లోని సరోజనిదేవి కంటి (Sarojini Devi eye hospital ) ఆసుపత్రి కిటకిటలాడింది. పదుల సంఖ్యలో బాధితులు, చిన్నారులు కంటి గాయాలతో ఆస్పత్రి వద్ద క్యూ కట్టారు. సుమారు 31 మంది చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చారు. బాధితుల్లో ఆరుగురిని అడ్మిట్ చేసుకున్నామని... వారిలో నలుగురిని అబ్జర్వేషన్లో పెట్టినట్లు వైద్యురాలు డాక్టర్ కవిత తెలిపారు. వారిలో ఇద్దరికీ సర్జరీ చేశామని వెల్లడించారు. మిగతా వారికి చిన్నపాటి గాయాలు కావడంతో చికిత్స అందించి.. ఇంటికి పంపించేశామని పేర్కొన్నారు. గురువారం నుంచి సరోజినీ దేవి కంటి ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అలర్ట్గా ఉన్నట్లు వివరించారు.
'నిన్నటి నుంచి సరోజినీ దేవి ఐ హాస్పిటల్కి ఫైర్ క్రాకర్ ఇంజ్యూరీస్ కేసులు వస్తున్నాయి. ఇప్పటివరకు 31 కేసులు వచ్చాయి. వారిలో ఆరుగురిని అడ్మిట్ చేశాం. వారిలో నలుగురిని అబ్జర్వేషన్లో పెట్టాము. ఇద్దరికీ సర్జరీ చేశాం. మిగతావారిలో 8మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఇద్దరు మహిళలు ఉన్నారు. మిగతావారు పురుషులే. ఇద్దరు వేరే జిల్లా నుంచి వచ్చారు. మిగతావారందరూ హైదరాబాద్ వారే. నిన్నటి నుంచి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. మొత్తం స్టాఫ్ అంతా సేవలందిస్తున్నాం. ఎవరు ఎప్పుడు వచ్చినా... వారందరికీ సేవలందించడానికి మేం రెడీగా ఉన్నాం.'
-కవిత, అసిస్టెంట్ డాక్టర్