హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెరాస ఓటమిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని వ్యాఖ్యానించారు. తెరాస చాలా ఎన్నికలు చూసిందన్నారు. సాగర్, భాజపా సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్నామని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.
Huzurabad by poll: హుజూరాబాద్‌లో ఓటమిపై మంత్రి స్పందించారిలా... - తితిదే అధికారులు
హుజూరాబాద్‌లో తెరాస ఓటమిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. తిరుమల స్వామివారిని మరికొంతమంది ప్రముఖులు సైతం దర్శించుకున్నారు.
Tirumala
మరోవైపు తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధ, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్, నటుడు రాజేంద్రప్రసాద్, సినీ దర్శకుడు గోపీచంద్ దర్శించుకున్నారు. ప్రముఖులకు స్వాగతం పలికిన తితిదే అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలను అందజేశారు.