పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని సినీనటి మంచు లక్ష్మి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జింగాటిక్ రిటైలర్స్ సంస్థ చేపట్టిన 'వన్ కోర్ టీస్' సామాజిక ప్రచారాన్ని ఆమె నగరంలో లాంఛనంగా ప్రారంభించారు.
'వన్ కోర్ టీస్' సామాజిక ప్రచారం ప్రారంభించిన మంచు లక్ష్మి - One crore Tees Campaign Manchu Lakshmi
భూమిని కాపాడాలంటే పిల్లలకు నాణ్యమైన విద్య అవసరమని సినీనటి మంచు లక్ష్మి అన్నారు. పేద విద్యార్థులకు విద్యనందించేందుకు జింగాటిక్ రిటైలర్స్ సంస్థ చేపట్టిన 'వన్ కోర్ టీస్' సామాజిక ప్రచారాన్ని హైదరాబాద్లో ఆమె ప్రారంభించారు.
Manchu_Lakshmi
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మెరుగైన విద్య కోసం 'టీచ్ ఫర్ ఛేంజ్' స్వచ్ఛంద సంస్థ ద్వారా మంచు లక్ష్మి కృషి చేస్తుండగా... జింగాటిక్ సంస్థ ఏడాదిలో కోటి టీ-షర్ట్స్ లను విక్రయించి... సుమారు 5 కోట్ల రూపాయలను 'టీచ్ ఫర్ చేంజ్'కు విరాళంగా ఇవ్వనుంది. ఆ డబ్బుతో దేశవ్యాప్తంగా టీచ్ ఫర్ చేంజ్ సంస్థ పనిచేస్తున్న 2500 పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించనున్నారు.
ఇదీ చూడండి :గడ్డిఅన్నారం మార్కెట్ యార్డు.. కోహెడకు తరలింపు