తెలంగాణ

telangana

ETV Bharat / state

chairpersons take charge: పదవీబాధ్యతలు స్వీకరించిన కొత్త ఛైర్మన్లు.. - P. Jaganmohan rao take charges

chairpersons take charge : రాష్ట్రంలో కార్పొరేషన్లకు నియామకమైన కొత్త ఛైర్మన్లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మన్నె క్రిశాంక్... రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్​గా గజ్జెల నగేష్ బాధ్యతలు స్వీకరించారు. తమపై నమ్మకముంచి.. అవకాశమిచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

chairpersons take charge, corporations new chairpersons
పదవీబాధ్యతలు స్వీకరించిన కొత్త ఛైర్మన్లు..

By

Published : Dec 29, 2021, 12:27 PM IST

Updated : Dec 29, 2021, 2:53 PM IST

chairpersons take charge : రాష్ట్రంలో తాజాగా నియామకమైన రెండు కార్పొరేషన్ల ఛైర్మన్లు పదవీబాధ్యతలు స్వీకరించారు. తమపై నమ్మకముంచి.. అవకాశమిచ్చినందుకు సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ఆయా కార్పొరేషన్లను అభివృద్ధి మార్గంలో నడిపించేందుకు తమవంతు కృషి చేస్తామని అన్నారు.

రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మన్నె క్రిశాంక్

బాధ్యతలు స్వీకరించిన మన్నె క్రిశాంక్

Manne Krishank take charge : : రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మన్నె క్రిశాంక్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ ఎండీసీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. మన్నె క్రిశాంక్‌ను స్వయంగా కుర్చిలో కూర్చోబెట్టారు. పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కేటీఆర్ సహా తెరాస నేతలు పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఎస్ఎండీసీని డిజిటలైజ్ చేసుకున్నామని.. సంస్థను ఆదాయ వనరుగా కూడా మార్చుకున్నామని ఛైర్మన్ క్రిశాంక్ అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం రూ.37 కోట్లు ఉన్న ఆదాయం... ప్రస్తుతం రూ.4,500 కోట్లకు పెంచుకున్నామని తెలిపారు.

రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్​గా గజ్జెల నగేష్

గజ్జెల నగేష్ బాధ్యతలు

gajjala nagesh take charges : రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్​గా గజ్జెల నగేష్ బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్​లో జరిగిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. మంత్రితోపాటు అధికారులు, పలువురు తెరాస నాయకులు తదితరులు హాజరయ్యారు. అంతకుముందు గన్​పార్క్​లోని అమరవీరుల స్థూపానికి నగేష్ పూలమాలలు వేసి... నివాళులర్పించారు.

పి.జగన్ మోహన్ రావు బాధ్యతలు

బాధ్యతలు స్వీకరించిన పి.జగన్ మోహన్ రావు

P. Jaganmohan rao take charges : రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఛైర్మన్​గా పి.జగన్ మోహన్ రావు బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న హకా భవన్ జరిగిన ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మాధవరం కృషి రావు తదితరులు పాల్గొన్నారు. సామాన్య కార్యకర్తగా ఉన్న తనను గుర్తించి... ఈ పదవిని కట్టబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. సమర్థవంతంగా పనిచేసి పదవికి వన్నె తెస్తానని అన్నారు.

ఇదీ చదవండి:chilli farmers problems: మిర్చి రైతుల కన్నీటి వేదన.. 20 రోజుల్లో రూ.40 కోట్ల ఖర్చు

Last Updated : Dec 29, 2021, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details