తెలంగాణ

telangana

ETV Bharat / state

మంజీరా పైప్​లైన్​ పగిలి నీరు వృథా... - హైదరాబాద్ లేటెస్ట్ అప్డేట్స్

సికింద్రాబాద్​లోని బాలాజీనగర్​లో మంజీరా పైప్​లైన్ పగిలి మంచి నీరు వృథాగా పోయింది. వరద ప్రవాహం ఎక్కువయ్యి పక్కనే ఉన్న దుకాణంలోకి నీరు చేరింది. జలమండలి అధికారులు వెంటనే స్పందించారు.

manjeera water pipeline leaked at balaji nagar in secunderabad
మంజీరా పైప్​లైన్​ పగిలి నీరు వృథా... దుకాణం జలమయం

By

Published : Dec 11, 2020, 9:37 AM IST

మంజీరా పైప్​లైన్​ పగిలి నీరు వృథాగా పోయి రహదారి జలమయం అయింది. సికింద్రాబాద్​లోని బాలాజీ నగర్ వద్ద ఉన్న పైప్​లైన్​ పగిలి ఒక్కసారిగా రోడ్డుపై మంచి నీటి వరద ప్రవహించింది. నీరు ఎక్కువ మోతాదులో పోవడంతో పక్కనే ఉన్న మెకానిక్ దుకాణం జలమయం అయింది. జలమండలి అధికారులు పరిశీలించి నీటిని ఆపే ప్రయత్నం చేశారు.

మంచి నీరు వరద ప్రవాహంలా మారడంతో రోడ్డుపై ఇరువైపులా నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వెంటనే అధికారులు అప్రమత్తమై నీటి పైప్​లైన్లు సరి చేశారు.

మంజీరా పైప్​లైన్​ పగిలి నీరు వృథా... దుకాణం జలమయం

ఇదీ చదవండి:పులి సంచారంతో వణుకుతున్న గ్రామాలు.. కొనసాగుతోన్న అన్వేషణ

ABOUT THE AUTHOR

...view details