తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేటు టీచర్ల సాయంలో అవకతవకలపై విచారణకు ఆదేశం - తెలంగాణ వార్తలు

కరోనా కష్టకాలంలో ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వం ప్రకటించిన సాయంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలలో లేని వారి పేర్లతో నిధులు స్వాహా చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఆదేశించారు.

Manipulations with the help of private teachers, school education
ప్రైవేటు టీచర్ల ఆర్థిక సాయం, పాఠశాల విద్యాశాఖ

By

Published : Jun 2, 2021, 8:53 AM IST

ప్రైవేటు ఉపాధ్యాయుల ఆపత్కాల సాయం పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన విచారణకు ఆదేశించారు. కరోనా కారణంగా ప్రైవేటు ఉపాధ్యాయలకు నెలకు రూ.2 వేలు, 20కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేస్తోంది. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు.. తమ బడుల్లో లేని వారి పేరిట నిధులు స్వాహా చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి.

ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం నాయకుడు ఐదుగురి పేరిట ఆర్థిక సాయం, బియ్యం తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరపాలని విద్యాశాఖ విచారణకు ఆదేశించింది.

ఇదీ చదవండి:ఒకరోజు వ్యవధిలోనే మాజీ సీఎస్‌ ఎస్వీ ప్రసాద్‌ దంపతులు మృతి

ABOUT THE AUTHOR

...view details