Manikrao Thakre Interesting Comments on Left Parties :వామపక్షాలతో పొత్తుల విషయమై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి చర్చలు జరగలేదని.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే స్పష్టం చేశారు. పొత్తులు అనేవి విధానపరమైనవని తెలిపారు. ఇది పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత లేకుండా జరగవని వెల్లడించారు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో.. తాను మాట్లాడడం సర్వసాధారణమని వ్యాఖ్యానించారు. మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పొత్తులపై తనను నేరుగా చర్చలు జరపమని హైకమాండ్ చెప్పలేదని మాణిక్‌రావు ఠాక్రే (Manikrao Thakre) స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు మద్దతు తెలిపేందుకు చాలా పార్టీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. ఇందులో భాగంగానే మందకృష్ణ మాదిగ, ఆర్.కృష్ణయ్య, ఇతర సంఘాల నేతలు కూడా వచ్చారని వివరించారు. కానీ తనను కలిసిన తర్వాత.. వారు ఏదో మాట్లాడితే.. తాను చేసేది ఏముందన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో తమకు ఒక విధానం ఉంటుందని.. దాని ప్రకారమే ఎంపిక చేస్తామని మాణిక్‌రావు ఠాక్రే వ్యాఖ్యానించారు.
MLA Balka Suman Controversy : 'కాంగ్రెస్ వాళ్లు మనవాళ్లే.. వారినేం అనొద్దు.. మనమే వాళ్లను పంపించాం'
పొత్తుల విషయంలో (Alliance in Left Parties) ప్రాథమికంగా తనతో పాటు.. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, ఇతర సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతామని మాణిక్‌రావు ఠాక్రే పేర్కొన్నారు. కానీ తుది నిర్ణయం అధిష్ఠానమే తీసుకుంటుందని వివరించారు. ఈ క్రమంలోనే సీపీఐతో అనధికారంగా సమావేశం జరిగినట్లు తెలిపారు. ఇందులో పొత్తుల గురించి, సీట్ల గురించి గానీ చర్చ జరగలేదని వివరించారు. మరోవైపు షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో విలీనం గురించి మాట్లాడుతూ.. విలీనం అనేది తన పరిధిలోని అంశం కాదని మాణిక్‌రావు ఠాక్రే చెప్పారు.
Revanthreddy on Assembly Seats : 'రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యతను నేను తీసుకుంటా'
ఈ ప్రతిపాదన గురించి కూడా తనకు తెలియదని మాణిక్‌రావు ఠాక్రే పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు సాధ్యమైనంత ఎక్కువ సీట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు.. పీఏసీ సమావేశంలో ప్రతి పార్లమెంట్ పరిధిలో.. రెండు బీసీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వారికి కేటాయించే సీట్లపై పార్టీలో కసరత్తు జరుగుతోందని వివరించారు. ఈ క్రమంలోనే ప్రధానంగా మరో మూడు డిక్లరేషన్లు ప్రకటించాల్సి ఉందని... అందులో ఓబీసీ మహిళా మైనారిటీ విభాగాలకు డిక్లరేషన్ల ప్రకటన ఉంటుందని మాణిక్‌రావు ఠాక్రే వివరించారు.
PCC Meeting in Gandhi Bhavan Tomorrow : మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ (PCC Meeting) .. రేపు సాయంత్రం గాంధీభవన్‌లో సమావేశం కానుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై చర్చ ఉంటుందని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఆశావహుల నుంచి అర్జీలు స్వీకరించిన పీసీసీ.. వాటి పరిశీలన కార్యక్రమం చేస్తోంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 1025 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
Telangana Congress Assembly Elections Campaigning Plan : ప్రచార శంఖారావం పూరించిన కాంగ్రెస్.. 'తరిమికొడదాం-తిరగబడదాం' నినాదంతో జనంలోకి
ఈ నేపథ్యంలోనే ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులను.. ఏఐసీసీ ఫార్మాట్లో పొందుపరిచే పనిలో గాంధీభవన్ సిబ్బంది కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఆర్జీలను వేరు చేస్తున్నారు. రిజర్వేషన్ నియోజకవర్గాల్లో వచ్చిన దరఖాస్తులను.. రిజర్వేషన్ కానీ జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం వచ్చిన వాటిని వేర్వేరుగా పరిశీలిస్తున్నారు. అదే విధంగా బీసీలకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల సంఖ్యను కూడా నియోజకవర్గాల వారీగా వేరు చేస్తున్నారు. రేపు జరగనున్న ప్రదేశ్ కాంగ్రెస్ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక విషయమై ప్రాథమికంగా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు జాబితా సిద్ధం కానందున అందుబాటులో ఉన్న సమాచారంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
సీపీఐ, సీపీఎం నేతల ఉమ్మడి సమావేశం.. దాని కోసమేనంట..!
'బీజేపీని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పనిచేస్తాం'