టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గృహ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్ తెలిపారు. సీఎం కేసీఆర్ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు రాకుండా రేవంత్‌ను అడ్డుకోవడం దారుణమని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారు. రేవంత్‌రెడ్డి హౌస్ అరెస్టును ఖండిస్తున్నాం. పార్లమెంట్ సమావేశాలకు రాకుండా రేవంత్‌ను అడ్డుకున్నారు. ప్రతిపక్ష పార్టీ హక్కులను తెరాస కాలరాస్తోంది. రేవంత్ అక్రమ అరెస్టును లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తాం. - మాణిక్కం ఠాగూర్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ