తెలంగాణ

telangana

ETV Bharat / state

Manhole Cover Alert: పొంగుతున్న మురుగు కాల్వలు.. తస్మాత్‌ జాగ్రత్త..! - తెలంగాణలో వర్షాలు

చినుకు పడితే చాలు భాగ్యనగర వాసులు భయపడుతున్నారు. చెరువులను తలపించే రోడ్ల మీద మ్యాన్ హోల్స్​ (Manhole Cover Alert)ను తప్పించుకుని బయటపడడం నగర జీవుల సహనాన్ని పరీక్షిస్తోంది. రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారటం వల్ల వాహనదారులు పడుతోన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

Manhole Cover Alert
పొంగుతున్న మురుగు కాల్వలు

By

Published : Sep 28, 2021, 9:39 AM IST

ఎడతెరిపి లేని వర్షంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లపై వరద పారుతోంది. గ్రేటర్‌ వ్యాప్తంగా మూడున్నర లక్షల మ్యాన్‌హోళ్లు (Manhole Cover Alert) ఉన్నాయి. వరద నీరు పోటెత్తడంతో కొన్నిచోట్ల మ్యాన్‌హోళ్ల మూతలు (Manhole Cover Alert) లేచిపోయి రోడ్లపైకి మురుగు పొంగుతోంది. ఇలాంటి చోట్ల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

  • చాలా మంది వరద నీరు పోవడానికని మ్యాన్‌హోల్‌ మూత (Manhole Cover Alert) తెరుస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఎట్టి పరిస్థితిలోనూ ప్రైవేటు వ్యక్తులు వాటిని తెరవద్దని.. ఏదైనా ఇబ్బంది ఉంటే 100 లేదా జల మండలి 155313 నెంబరుకు ఫోన్‌ చేసి సమాచారం అందించాలి.
  • వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మధ్య నుంచి బైక్‌ పోనివ్వడం, నడుచుకుంటూ వెళ్లవద్ధు బస్సులు, ఆటోల వెనుక ద్విచక్ర వాహనంతో వెళ్లకూడదు. మధ్యలో మ్యాన్‌హోల్‌ (Manhole Cover Alert) ఉంటే కనిపించక ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. డ్రైనేజీ గుంతలో పడి ఒకరు గల్లంతు

LIVE VIDEO: హైదరాబాద్​ మణికొండలో గుంతలో పడి వ్యక్తి గల్లంతు

man drowns in nala: డ్రైనేజీలో కొట్టుకుపోయిన సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ కోసం కొనసాగుతోన్న గాలింపు

ఇటీవల పడుతున్న వరుస వర్షాలతో ప్రధాన రోడ్లతో పాటు, పలు లింకు రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. పెద్ద పెద్ద గుంతలతో పాటు.. రోడ్ల తారు మొత్తం లేచిపోయింది. ఉదయం, సాయంత్రం సమయాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. పలు రోడ్లలో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వీలైనంత త్వరగా మరమ్మతులు చేయకుంటే... రాజధాని రహదారులు.. నగరవాసులకు నరకప్రాయం అవడం ఖాయం.

ఇదీ చూడండి:Heavy Rain in Telangana : తెలంగాణ అతలాకుతలం.. హైదరాబాద్​ జలమయం... నేడూ భారీ వర్షాలు

'గులాబ్​'తో ఒడిశా గజగజ- కుండపోత వానలు, ఉప్పొంగిన వాగులు

Gulab Effect: గులాబ్ తెచ్చిన గుబులు

ABOUT THE AUTHOR

...view details