పొరపాటున ఓ ఆవు గొంతులో మామిడి కాయ ఇరుక్కుంది. శ్రీవేంటేశ్వర పశువైద్య కళాశాల అధ్యాపకులు శస్త్ర చికిత్స నిర్వహించి తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. ఎర్రావారిపాలెం మండలానికి చెందిన మహిధర్ పాడి ఆవు సోమవారం సాయంత్రం మేతకు వెళ్లి మామిడి కాయ తింది. అది అన్నవాహికలో ఇరుక్కోవడంతో పొట్ట ఉబ్బరంతో ప్రాణాపాయ స్థితికి చేరింది. బాధిత రైతు పశువును తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య కళాశాల ఆధునిక చికిత్స సముదాయానికి తీసుకెళ్లారు. అప్పటికే వైద్యులు వెళ్లిపోయారు.
ఆవు గొంతులో ఇరుక్కున్న మామిడికాయ... తొలగించిన వైద్యులు - ap news
ఆవు గొంతులో ఇరుక్కున్న మామిడికాయను శస్త్ర చికిత్స చేసి తొలగించారు పశువైద్యులు. ఈ ఘటన తిరుపతిలో జరిగింది.
mangomango
అక్కడి సిబ్బంది కళాశాల అధ్యాపకులకు సమాచారమిచ్చారు. పశువైద్య శస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఆర్వీ సురేష్‌కుమార్ రెండు గంటల పాటు శ్రమించి అత్యవసర శస్త్ర చికిత్స ద్వారా మామిడి కాయను తొలగించారు. డాక్టర్ గిరీష్, రేడియోగ్రాఫర్ విశ్వనాథరెడ్డి శస్త్రచికిత్సలో భాగస్వాములయ్యారు. అధ్యాపకులకు ఆవు యజమాని కృతజ్ఞతలు తెలిపాడు.
ఇదీ చదవండి:NGT: రిజర్వాయర్ల నిర్మాణ వివాదంపై జోక్యం చేసుకోలేం.. ఏపీ రైతుల పిటిషన్‌పై ఎన్జీటీ