ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో మంగళవారం సంతలో ఒక దుకాణదారుడు వద్ద అమ్మకానికి ఉంచిన మామిడి పండ్లు బంగాళాదుంపలను పోలి ఉన్నాయి. వీటిని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పైకి అలా ఉన్నా బాగుంటుందని ఆ వ్యాపారి మచ్చుకు ఒక కాయ ముక్కలుగా కోసి కొనుగోలు చేసే వారికి రుచి చూపించాడు.
బంగాళాదుంపలను పోలిన మామిడి పండ్లు - తూర్పుగోదావరి జిల్లా
అవి బంగాళాదుంపలు కాదు. మామిడి పండ్లు. చూడటానికి మాత్రం బంగాళాదుంపల్లా కనిపిస్తున్నాయి.

potato
వీటి గురించి... ఈటీవీ భారత్ ప్రతినిధి అంబాజీపేటలోని ఉద్యాన పరిశోధన స్థానం కీటక విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చలపతిరావును సంప్రదించగా... మామిడికాయలపై తామర పురుగులు ఆశించి కాయపై పొరను గోకటం కారణంగా ఇలా అవుతాయని వివరించారు. దీనిని రైతు భాషలో రాతిమంగు అంటారని చెప్పారు.
ఇది చదవండిఈ దారి...గతుకుల రహదారి
Last Updated : Jun 24, 2020, 3:19 PM IST