తెలంగాణ

telangana

ETV Bharat / state

మాదన్న మండికి చినుకు కష్టాలు - హైదరాబాద్ పాతబస్తీ

మాదన్న పేట మండి... చినుకు పడితే రైతులు వినియోగదారులకు నరకం చూపిస్తోంది. బురదనీరు వెళ్లే మార్గం ఉండదు. కొనాలన్నా అమ్మాలన్నా బురదలోనే వాన నీటి యేరులను దాటి రావాలి. కొనే వారులేక మార్కెట్​ వెలవెల బోతోంది. నిత్యం రద్దీగా ఉండే పాత బస్తీ మండిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.

మాదన్న మండికి చినుకు కష్టాలు

By

Published : Aug 24, 2019, 6:13 PM IST

హైదరాబాద్ పాతబస్తీలో అతి పెద్ద కూరగాయల మార్కెట్‌లో ఒకటైన మాదన్నపేట మండి. చిరుజల్లులకే మురుగు జలాశయంగా మారుతోంది. నిత్యం వేలసంఖ్యలో వినియోగదారుల రాకపోకలతో రద్దీగా ఉండే మార్కెట్​ రెండు రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షానికి మండి ఆవరణంతా బురదమయం అవుతుంది. మార్కెట్‌లో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గంలేదు. వర్షం పడిన తర్వాత బురదకారణంగా మార్కెట్‌లోకి వెళ్లేందుకు వీలులేక వినియోగదారుల రాక తగ్గి మండి వెలవెలబోతుంది. హైదరాబాద్ నగర శివారులోని రంగారెడ్డి జిల్లా నుంచి సుమారు 30 గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు తాము పండించిన కూరగాయలను ఆకుకూరలను విక్రయించేందుకు మాదన్నపేట మండికే వస్తుంటారు. కష్టించి పండించిన పంటను వర్షంలోనూ వ్యయప్రయాసలకు ఓర్చి మాదన్నపేట మండికి తీసుకువస్తే కొనేవారు లేక విలువైన పంటను బురదలోనే పడేసి వెళ్లాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండిలో అమ్మకం పన్నులు చెల్లిస్తున్నా.... తమకు కనీస సౌకర్యాలు కల్పించరా అని మార్కెటింగ్ అధికారులను ప్రశ్నిస్తున్నారు.

మాదన్న మండికి చినుకు కష్టాలు

ABOUT THE AUTHOR

...view details