తెలంగాణ

telangana

ETV Bharat / state

మాండౌస్‌ తుపాను ప్రభావం.. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు - Rains across the state effect of Mandaus Cyclone

Mandaus Cyclone: మాండౌస్‌ తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ముసురు పట్టింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షం కురుస్తోంది. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై... నగరంలో వాన పడుతోంది.

Mandaus Cyclone
మాండౌస్‌ తుపాను

By

Published : Dec 13, 2022, 8:22 PM IST

Mandaus Cyclone: మాండౌస్‌ తుపాను ప్రభావంతో హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం పడుతోంది. ఖైరతాబాద్, అమీర్​పేట్​, కూకట్​పల్లి, గచ్చిబౌలి, నాంపల్లి, కోఠి, హిమాయత్​నగర్‌, సుల్తాన్‌ బజార్‌, ట్యాంక్‌ బండ్‌, సోమాజీగూడ ప్రాంతాల్లో వర్షం పడింది.

సరిగ్గా ఉద్యోగులు పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ద్రోణి ప్రభావంతో పాటు దక్షిణాది నుంచి తెలంగాణలోకి వీస్తున్న గాలుల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details