ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ షరిఫ్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించారు. తన బంధువుల ఇంటికి వచ్చిన ఆయన... తిరిగి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తూ మధ్యలో తణుకు వేల్పూరు రోడ్డులోని మసీదులో ప్రార్థనలు చేశారు.
'ఆవేశంతో మాట్లాడారు... ఉద్దేశపూర్వకంగా కాదు' - నర్సాపురంలో శాసన మండలి చైర్మన్ పర్యటన
శాసనమండలిలో మంత్రులు ఆవేశంతో మాట్లాడారని ఆంధ్రప్రదేశ్ మండలి ఛైర్మన్ షరిఫ్ వివరించారు. ఉద్దేశపూర్వకంగా దుర్భాషలాడలేదని వెల్లడించారు.
'ఆవేశంతో మాట్లాడారు... ఉద్దేశపూర్వకంగా కాదు'
బుధవారం మండలిలో జరిగిన పరిణామాలపై స్పందించారు. కోపం వచ్చినప్పుడు ఆవేశంలో ఎన్నో మాట్లాడుతుంటారని... వాటిని పట్టించుకోవాల్సినవసరం లేదన్నారు. తననెవరూ ప్రలోభపెట్టలేదని స్పష్టం చేశారు. తనకున్న అధికారంతోనే బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: చేతుల్లేకపోయినా.. ఓటేసి స్ఫూర్తినిచ్చాడు
TAGGED:
sharif comments on mandali