తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ నెల 8న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఛలో మహాగర్జన - parsigutta

అంబేడ్కర్ విగ్రహ ధ్వంసం, ఇంటర్ ఫలితాలు, హాజీపూర్ హత్యల్లో ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ ఈ నెల 8న ఎమ్మార్పీఎస్ నాయకులు మహాగర్జన సభ నిర్వహించనున్నారు. గోడపత్రికను మంద కృష్ణ మాదిగ విడుదల చేశారు.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఛలో మహాగర్జన

By

Published : May 4, 2019, 6:32 AM IST

Updated : May 4, 2019, 9:32 AM IST

సికింద్రాబాద్ పార్సీగుట్టలోని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయంలో అంబేడ్కర్ విగ్రహ ధ్వంస వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు గోడ పత్రికను ఆవిష్కరించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని... అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని మందకృష్ణ మాదిగ విమర్శించారు. అంబేడ్కర్ విగ్రహం కూల్చి 20రోజులు అవుతున్నా.. కనీసం పునః ప్రతిష్ఠాపన చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 25మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోకపోవడం, విద్యాశాఖ మంత్రిని బర్త​రఫ్ చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఈనెల 8న జరిగే ఛలో ఇందిరాపార్క్ అంబేడ్కర్ వాదుల మహాగర్జనను విజయవంతం చేయాలని మందకృష్ణ మాదిగ సూచించారు.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఛలో మహాగర్జన
Last Updated : May 4, 2019, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details