తెలంగాణ

telangana

ETV Bharat / state

'సామాజిక న్యాయం లేని మంత్రివర్గాన్ని సీఎం కేసీఆర్‌ రద్దు చేసుకోవాలి' - సకల జనుల మహా దీక్ష

సామాజిక న్యాయం లేని మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రద్దు చేసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.  మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జనాభా ప్రకారంగా చోటుకల్పించాలని కోరుతూ... వచ్చే నెల 13న తలపెట్టిన సకల జనుల మహా దీక్షను అక్టోబర్ 20 తేదీకి మార్చినట్లు మందకృష్ణ మాదిగ వెల్లడించారు.

sakala janula Mahadeeksha

By

Published : Sep 25, 2019, 5:52 PM IST

జనాభా దామాషా ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సరైన ప్రాతినిధ్యం దక్కెలా మంత్రివర్గాన్నిఏర్పాటు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం లేని మంత్రివర్గాన్ని సీఎం కేసీఆర్‌ రద్దు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న కొప్పుల ఈశ్వర్‌ను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించాలన్నారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జనాభా ప్రకారంగా చోటుకల్పించాలని కోరుతూ... వచ్చే నెల 13న తలపెట్టిన సకల జనుల మహా దీక్షను అక్టోబర్ 20కి మార్చినట్లు ఆయన వెల్లడించారు. ఆ రోజున ఇందిరాపార్కు వద్ద జరిగే మహా saదీక్షలో వైశ్య, బ్రాహ్మణులకు కూడా వాటా దక్కాలని డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 90శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రివర్గంలో 90 శాతం వాటా ఎందుకు లేదని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.

'సామాజిక న్యాయం లేని మంత్రివర్గాన్ని సీఎం కేసీఆర్‌ రద్దు చేసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details