దళిత మహిళలపై జరిగిన అత్యాచార ఘటనలపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఓయూ దూరవిద్య ఆడిటోరియంలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దేశంలో అగ్రకులాలకు ఓ న్యాయం అణగారిన వర్గాలకో న్యాయం జరుగుతుందని మంద కృష్ణ మండిపడ్డారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను కులం, మతం పరంగా కాకుండా మానవత్వంతో చూడాలని అన్నారు. అణగారిన కులానికి చెందిన 'సమత' కేసు విషయాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
'సమత' కేసులో ప్రభుత్వ తీరు బాధాకరం: మందకృష్ణ - మందకృష్ణ మాదిగ తాజా వార్త
దేశంలో మానవత్వంతో న్యాయం జరిగేలా ఉండాలని మందకృష్ణ మాదిగ అన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మందకృష్ణ మాదిగ అన్ని విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
'పేదోడికో న్యాయం పెద్దోళ్లోకో న్యాయమా?'