ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ఖతం చేయాలని చూస్తే... కేసీఆర్ రాజకీయ జీవితాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు ఖతం చేస్తాయని ఎమ్మార్పీఎస్వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదల వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
సబ్బండ వర్గాల మహాధర్నా
ఈ సమావేశంలో మందకృష్ణ మాదిగతో పాటు ఆయా సంఘాలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని.. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా తమ భవిష్యత్ కార్యచరణను మందకృష్ణ మాదిగ ప్రకటించారు. ఈనెల 17న ఇందిరా పార్క్ వద్ద సబ్బండ వర్గాలు మహాధర్నా నిర్వహిస్తున్నట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు.