ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికలాంగుల మనోవికాస కేంద్రాల సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగా డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికలాంగుల మనోవికాస కేంద్ర సిబ్బంది డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు.
శోచనీయం..
మనోవికాస కేంద్రాల్లో పని చేస్తున్న దివ్యాంగుల జీతాలు పెన్షన్‌లను ప్రభుత్వం నిలిపివేయడం శోచనీయమన్నారు. 2 వేల మంది ఒప్పంద విద్యుత్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.... వికలాంగుల మనోవికాస కేంద్రాల్లో పని చేస్తున్న 200 మందికి ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించలేరా అని ఆయన ప్రశ్నించారు.